పుష్కరాలు, ఉత్సవాలకు
ఇబ్బందులు కలగకుండా..
కాళేశ్వరం దేవస్థానం సమీప త్రివేణి సంగమంలో గోదావరి, ప్రాణహిత, సరస్వతి పుష్కరాలు 12ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. శివరాత్రి ఉత్సవాలు, శ్రీదేవీశరన్నవరాత్రి ఉత్సవాలు, శ్రావణ, కార్తీకమాస ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఆ సమయంలో వీవీఐపీలు, భక్తులు తరలివస్తుంటారు. ఇలాంటి సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు భక్తులు, దేవస్థాన కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. విద్యుత్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కొత్త విద్యుత్ లైన్ ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్నారం నుంచి కాళేశ్వరం..
ప్రస్తుతం గంగారం సబ్‌స్టేషన్ నుంచి అన్నారం వరకు 33/11కేవీ వచ్చే విద్యుత్ లైను కాళేశ్వరం వరకు ఏర్పాటు చేయాలని ఎన్‌పీడీసీఎల్ అధికారులు ప్రతిపాదించారు. ఈ లైన్ గ్రావిటీ కాల్వ వెంట కుడిచేయి వైపున ఉన్న టవర్‌ల నుంచి కాళేశ్వరం రోడ్డు గుండా 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ లైన్ ఏర్పాటైతే మహదేవపూర్ 33/11 కేవీ లైన్‌లో సాంకేతిక సమస్యలు, బ్రేక్‌డౌన్‌లు ఏర్పడిన సమయంలో కాళేశ్వరానికి ప్రత్యామ్నాయ మార్గంలో విద్యుత్ సరఫరా అందించే అవకాశం ఉంటుంది.
కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి అంతరాయం లేని విద్యుత్ వెలుగులు అందించేందుకు త్వరలో ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయనున్నారు. మహదేవపూర్ 33/11 కేవీ విద్యుత్ లైన్‌లో బ్రేక్‌డౌన్ ఏర్పడినప్పుడల్లా కాళేశ్వరం ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు చీకటిమయమవుతున్నాయి. అన్నారం నుంచి కాళేశ్వరం వరకు రోడ్డు గుండా 12 కిలోమీటర్లమేర కొత్త లైన్ నిర్మించాలని ఎన్పీడీసీఎల్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సర్వే చేయాలని ఆదేశించినా.. అటవీ, ఇరిగేషన్ శాఖల నుంచి ఎన్‌ఓసీ ఇప్పటివరకు రాలేదు.
ప్రతీ తల్లిదండ్రికి తమ కూతుళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచిన కూతురు ఉన్నతస్థానానికి ఎదిగితే ఆ విజయం చూసి మురిసిపోవడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు. కూతురితో గడిపిన ప్రతీ విషయం ఓ తీపిజ్ఞాపకం. మీకూ అలాంటి తీపి జ్ఞాపకాలు, మీ కూతురు గొప్పతనం గురించి డాటర్స్ డే (కూతురు దినోత్సవం) సందర్భంగా ‘సాక్షి’తో పంచుకోండి. దీంతోపాటు తల్లిదండ్రి తమ కూతురుతో దిగిన సెల్ఫీఫొటో, మీ పేరు, ప్రాంతం వివరాలను ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా కింది వాట్సాప్ నంబర్‌కు పంపండి. వచ్చిన వాటిని స్క్రూటినీ చేసి 27వ తేదీ పత్రికలో ప్రచురిస్తాం.
జాయింట్ సర్వే చేస్తాం..
అన్నారం నుంచి కాళేశ్వరం వరకు ప్రత్యామ్నాయ లైన్ కోసం రూ.70లక్షల నిధులు మంజూరయ్యాయి. డీఈ, ఏఈ, సిబ్బందితో 12 కిలోమీటర్లు సర్వే చేశాం. మంత్రి శ్రీధర్‌బాబు 24వ తేదీ వరకు అటవీ, ఇరిగేషన్‌శాఖలకు ఎన్‌ఓసీ ఇవ్వాలని సూచించారు. కానీ ఇవ్వలేదు. దానిపై (నేడు) ఆయా శాఖతో కలిసి శనివారం జాయింట్ సర్వే చేయనున్నాం. లైన్ వేస్తే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగదు.
– సదానందం, టీజీ ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ, భూపాలపల్లి
కాళేశ్వరానికి మరో విద్యుత్ లైన్ ● మహదేవపూర్ 33/11 కేవీకి ప్రత్యామ్నాయ
సరఫరాకు మరో లైన్ ప్రతిపాదన ● పుష్కరాలు, ఉత్సవాలకు విద్యుత్ అంతరాయం లేకుండా.. ● ఇరిగేషన్, అటవీశాఖల ఎన్‌ఓసీ కోసం ఎదురుచూపు
చిన్న కాళేశ్వరం నుంచి..
కాళేశ్వరానికి 3 కిలోమీటర్ల దూరంలో చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు వచ్చే 132/11 కేవీ నుంచి 133/11 కేవీగా చేసి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలి. ట్రాన్స్‌కో ద్వారా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కిలోమీటర్ దూరంలో ఉన్న మేడిగడ్డ లక్ష్మీబరాజ్‌లో ఉన్న 220కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి కూడా ట్రాన్స్‌కో అనుమతి తీసుకుంటే సులభంగా మరో లైన్‌కు ఆస్కారం ఉంది.
అన్నారం మీదుగా కాళేశ్వరం విద్యుత్ లైన్ తీసుకురావాలంటే 12కిలోమీటర్ల దూరం. ఇందులో 10కిలోమీటర్లు గ్రావిటీ కాల్వ ఇరిగేషన్ ఆధీనంలో ఉంది. మిగితా రెండు కిలోమీటర్లు అటవీశాఖది. దీంతో ఇద్దరి ఎన్‌ఓసీ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో లైన్ నిర్మాణానికి సంబంధించి ఇరిగేషన్, అటవీ శాఖల పరిధిలో అనుమతులు, మార్గానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి. మంత్రి శ్రీధర్‌బాబు అటవీశాఖ డీఎఫ్‌ఓ, ఇరిగేషన్ ఎస్‌ఈలతో మాట్లాడి ఎన్‌ఓసీ ఇవ్వాలని సూచించారు. 24న గురువారం వరకు పరిశీలన చేసి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు.
మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ : 99510 50872
– కాళేశ్వరం


