కుష్ఠు రహిత సమాజానికి కృషి | - | Sakshi
Sakshi News home page

కుష్ఠు రహిత సమాజానికి కృషి

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

భూపాలపల్లి అర్బన్‌/గణపురం/రేగొండ: కుష్ఠు రహిత సమాజ స్థాపన లక్ష్యంగా వైద్య సిబ్బందితో పాటు ప్రజలందరూ సమష్టిగా కృషిచేయాలని కేంద్ర కుష్ఠు వ్యాధి నివారణ బృందం సూచించింది. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం రేగొండ, గణపురం, కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. అనంతరం జిల్లాకేంద్రంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఆర్‌బీఎస్‌కే బృందంతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం 35 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు నమోదై ఉండగా, వారిలో 29 మంది ఎంబీ (మల్టీ బాసిల్లరీ), ఆరుగురు పీబీ (పాసీ బాసిల్లరీ) కేసులుగా గుర్తించారు. ఎంబీ కేసుల్లో వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అనుమానిత లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించాలని అధికారులు సూచించారు. అనంతరం పీహెచ్‌సీల రికార్డులు, నివేదికలు, కేస్‌ కార్డులను కేంద్ర బృందం పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేసింది. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మధుసూదన్‌, కేంద్ర అధికారి, సీహెచ్‌ఎల్‌ఆర్‌ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ వీరకుమార్‌, డాక్టర్‌ నాగరాజు, డాక్టర్‌ రాజు పాల్గొన్నారు.

కేంద్ర కుష్ఠు వ్యాధి నివారణ బృందం సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement