పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పనులు వేగవంతం చేయాలి

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

● అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌

కాళేశ్వరం: కాళేశ్వరంలో వచ్చే ఏడాది జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదించిన నూతన అష్ట తీర్థాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాల కోసం చేపట్టిన రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. సిరోంచ బ్రిడ్జి నుంచి ప్రధాన ఘాట్‌ వరకు 2 కిలోమీటర్లు, సరస్వతీ ఘాట్‌ నుంచి పక్షి తీర్థం వరకు 0.8 కిలోమీటర్ల పరిధిలో ప్రతిపాదించిన ఐదు నూతన తీర్థాల స్థలాలను పరిశీలించారు. అనంతరం ఆదిముక్తీశ్వర ఆలయం నుంచి సరస్వతీ ఘాట్‌ వరకు భూసేకరణ పూర్తయిన శాశ్వత రహదారి నిర్మాణ స్థలాన్ని పరిశీలించి పనులను నిర్ణీత ప్రణాళిక ప్రకారం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సిరోంచ బ్రిడ్జి సమీపంలోని వినాయక నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కన్నెపల్లిలో కొనసాగుతున్న భూముల రీసర్వే పనులను కూడా పరిశీలించి పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని సర్వే సిబ్బందికి సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ పర్యటనలో తహసీల్దార్‌ సత్యనారాయణ స్వామి, మండల సర్వేయర్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement