భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లి డబుల్‌బెడ్ రూమ్‌లలో మున్సిపల్ అధికారులు డోర్‌లాక్ పేరుతో వేధిస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. మంగళవారం ఆయన డబుల్ బెడ్ రూమ్‌కాలనీలో పర్యటించారు. వినాయక మండపాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూం ఇళ్లలో ఉండే వారు పొద్దున లేస్తే కూలి పనులకు వెళ్తారని.. ఇదే అదునుగా మున్సిపాలిటీ అధికారులు సర్వేకు వచ్చి తాళం వేసి ఉన్న తమ ఇండ్లను డోర్‌లాక్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారన్నారు. పేదలను ఇబ్బందులు పెట్టవద్దని కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. మధుసూదనాచారి వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
శాసనమండలి ప్రతిపక్ష నేత
మధుసూదనాచారి


