మల్చింగ్‌తో మిర్చి లాభాలు | - | Sakshi
Sakshi News home page

మల్చింగ్‌తో మిర్చి లాభాలు

Sep 22 2026 12:54 AM | Updated on Sep 22 2026 12:54 AM

– 8లోu అదనపు టార్గెట్‌కు ప్రతిపాదనలు పంపించాం మందుల ఖర్చు తగ్గుతుంది

భాగస్వాములు కావాలి
ప్రధాని మోదీ సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని యువత సమాజ సేవలో భాగస్వాములు కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిషిధర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు కాస్త ఉక్కపోతగా ఉంటుంది.

మల్హర్‌

మొగుళ్లపల్లి

రేగొండ

భూపాలపల్లి

గణపురం

పలిమెల

చిట్యాల

మహదేవపూర్‌

టేకుమట్ల

కొత్తపల్లిగోరి

మహాముత్తారం

కాటారం

మల్హర్‌: మిర్చి సాగులో అధునాతన మల్చింగ్‌ విధానం రైతులకు వరప్రదాయినిగా మారుతోంది. నీటి పొదుపు, కలుపు నివారణ, పురుగు మందుల వాడకం తగ్గడంతో పాటు ప్రభుత్వ సబ్సిడీ తోడవడంతో జిల్లాలోని అన్నదాతలు ఈ పద్ధతిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది 13,848 ఎకరాల్లో మిర్చి సాగుతుండగా గతేడాది వానాకాలంలో 1,996 ఎకరాల్లో మల్చింగ్‌ సాగు జరిగింది. ఈ ఏడాది అది ఏకంగా 3,363 ఎకరాలకు చేరింది. గతేడాదితో పోలిస్తే అదనంగా 1,367 ఎకరాల్లో మల్చింగ్‌ విధానాన్ని రైతులు అవలంబిస్తుండడం విశేషం.

మల్చింగ్‌తో ఉపయోగాలు

మొక్క చుట్టూ భూమిలో ఉండే తేమ ఆవిరి కాకుండా నివారించడం వల్ల వివిధ కాలపరిమితులు గల పంటలకు 30–40 శాతం వరకు నీటి ఆదా అవుతుంది. ఇంకా దీనిని బిందు సేద్యం పద్ధతిలో కలిపి వాడితే అదనంగా 20శాతం నీరు ఆదా అవుతుంది. సూర్యరశ్మి నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడం వల్ల కిరణజన్య సంయోగక్రియ జరగక సుమారు 85 శాతం వరకు కలుపును నివారించవచ్చు. మొక్కలకు వాటి జీవితకాలమంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు ఏర్పడి ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో (20–50శాతం) అధిక దిగుబడులు పొందవచ్చు.భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండడం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్థ బాగా వద్ధి చెందుతుంది. దీనివల్ల నీరు, ఎరువులు భూమి లోపల పొరల్లో నుంచి కూడా మొక్కలకు అధికంగా లభ్యమవుతుంది.

ప్రస్తుతం మల్చింగ్‌కు ఎకరాకు రూ.8 వేల చొప్పున సబ్సిడీ ఇస్తున్నారు. జిల్లాకు 250 ఎకరాల టార్గెట్‌ ఇవ్వగా, సాగు పెరగడంతో అదనపు టార్గెట్‌ కోసం ప్రతిపాదనలు పంపించాం. మల్చింగ్‌ వల్ల కలుపు, నీటి ఖర్చు, పురుగు మందుల వాడకం 40 శాతం వరకు తగ్గుతుంది.

– తిరుపతి, జిల్లా ఉద్యాన అధికారి

గతంలో కలుపు తీతకే ఎకరాకు రూ.20 వేలు అయ్యేది. ఇప్పుడు మల్చింగ్‌ వేయడంతో కలుపు సమస్య లేదు. నీరు కూడా తక్కువ పడుతోంది. మందుల ఖర్చు సగానికి సగం తగ్గింది. పంట నాణ్యత బాగుండి మార్కెట్లో మంచి రేటు వస్తోంది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడి వస్తుంది.

– శ్రీనివాస్‌, మల్లారం, రైతు, మల్హర్‌

జిల్లాలో 3,363 ఎకరాల్లో సాగు

గతేడాది కంటే 1,367 ఎకరాల్లో పెరుగుదల

తక్కువ పెట్టుబడి..

ఎక్కువ లాభాలే కారణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement