నిర్ణీత వ్యవధిలో భూసేకరణ పూర్తి | - | Sakshi
Sakshi News home page

నిర్ణీత వ్యవధిలో భూసేకరణ పూర్తి

Sep 22 2026 12:54 AM | Updated on Sep 22 2026 12:54 AM

● అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌

భూపాలపల్లి: నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తామని అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ వెల్లడించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ పనుల పురోగతిపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ నుంచి కాటారం సబ్‌ కలెక్టర్‌ సౌరవ్‌ శర్మ, ఎస్డీసీ రమేశ్‌, ఆర్డీఓ హరిక్రిష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్‌ నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.

గడువులోగా పరిష్కరిస్తాం..

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఫారం–6, 7, 8 దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధి కారులు, ఎన్నికల నమోదు అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియను జిల్లాలవారీగా సమీక్షించారు.

ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి..

ప్రజావాణి ఫిర్యాదులకు అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 68మంది నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, డీఆర్‌ఓ వసంతకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

చెత్తను 4 రకాలుగా విభజించాలి..

జిల్లాలోని గ్రామాలు, పట్టణాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లో చెత్తను నాలుగు రకాలుగా విభజించి సేకరించే విధానాన్ని అమలు చేయాలని అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వేస్ట్‌ మేనేజ్మెంట్‌పై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెగ్రిగేషన్‌ను నాలుగు అంశాలుగా జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ వసంతకుమారి, ఆర్డీఓ హరిక్రిష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement