జనగామ: జిల్లాకేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో సోమవారం అండర్–19 బాల,బాలికల ఉమ్మడి వరంగల్ జిల్లా ఫుట్‌బాల్ సెలక్షన్స్ నిర్వహించారు. సుమారు 300 మంది బాల,బాలికలు పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. ప్రతిభ కనబరిచిన క్రీ డాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై న వారు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. సెలక్షన్స్‌ను ఎస్‌జీఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీధర్ పర్యవేక్షించారు. క్రీడాకారులు క్రమశిక్షణతో పాల్గొని ప్రతిభను చాటుకోవడంపై నిర్వాహకులు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్కడ కూడా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ నరసింహులు గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ నరేందర్, రవీందర్, కాలేజీ పీడీ కిషన్, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్, పీడీ ఘన్‌పూర్ జె.గోర్ సింగ్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి లింగనాయక్ పాల్గొన్నారు.


