కాలం మారినా.. వయసు పెరిగినా ఆ చిన్ననాటి స్నేహబంధం కొంచెం కూడా చెరిగిపోలేదు. పాఠశాల విద్య పూర్తయి 46 సంవత్సరాలు గడిచినా జ్ఞాపకాలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. చిట్యాల మండలం జూకల్ ఉన్నత పాఠశాల 1979–80 టెన్త్ బ్యాచ్‌కి చెందిన పూర్వ విద్యార్థులు 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం చదువుకున్న పాఠశాలలోనే ఒకేచోట చేరి ఆత్మీయ ముచ్చట్లతో అలరించారు. కుటుంబసమేతంగా హాజరై పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు గిరగాని కృష్ణ, సర్పంచ్ ఎలగొండ సంధ్యారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనాటి గురువులైన ఐత రాజయ్య, పడగాల అయిలయ్య, రాంమోహన్‌రావు, బండి రాజమౌళిలకు పాదాభివందనం చేస్తూ సత్కరించారు. – చిట్యాల


