భూపాలపల్లి రూరల్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి, త్యాగాలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి సందర్భంగా సోమవారం మంజూర్‌నగర్‌లోని లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్, వివిధ మండలాల అధ్యక్షులు, పద్మశాలి సంఘం నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


