కాళేశ్వరం: ‘కాళేశ్వరం దేవస్థానం పనుల్లో నాణ్యత ఏది’ అనే శీర్షికన శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర దేవాదాయశాఖ, ఆర్‌అండ్‌బీశాఖ ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. పనుల నాణ్యత, కాంట్రాక్టర్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయనే కథనంపై ఇంజనీరింగ్ అధికారులను కూడా మందలించినట్లు తెలిసింది. పనుల విషయంలో రాజీ లేకుండా నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే ఇంజనీర్లకు మెమోలు, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోన్నట్లు ఆదేశించినట్లు తెలిసింది. సాక్షి కథనంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.


