ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు

Sep 20 2026 1:03 AM | Updated on Sep 20 2026 1:03 AM

భూపాలపల్లి అర్బన్‌: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శని వారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో కలెక్టర్‌ రాహుల్‌శర్మతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. తొలుత డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గురువును మించిన దైవం లేదని, విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల సేవలు ఎనలేనివని అన్నారు. కలెక్టర్‌ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధితో పాటు సమాజ పురోగతిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజబాబు, డీఈఓ లలిత, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థుల భవిష్యత్‌ నిర్మాణంలో

కీలక పాత్ర

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement