మల్హర్(కాటారం): నో బ్యాగ్ డేలో భాగంగా మండల విద్యాశాఖ అధికారి శ్రీదేవి ఆధ్వర్యంలో శనివారం కాటారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సౌరబ్ శర్మ విద్యార్థులతో సంభాషించారు. విద్యాభ్యాసం, విద్యార్థుల ప్రతిభపై ఆరాతీశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సౌరబ్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు ఈ స్థాయిలోనే ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకెళ్లాలని సూచించారు. విద్యార్థులు తమలో ఉన్నతమైన భావాలను పెంపొందించుకొని భవిష్యత్‌లో మంచి ఉద్యోగ అవకాశాలతో వివిధ హోదాలలో స్థిరపడే విధంగా ఈ సందర్శన ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బూర రమేశ్, ఉపాధ్యాయులు బొల్లం ఈశ్వరి, గుబిరె లక్ష్మి, గడ్డం ఫణిధర్ పాల్గొన్నారు.


