పోలీస్‌ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్‌ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్‌

Sep 19 2026 5:50 AM | Updated on Sep 19 2026 5:50 AM

భూపాలపల్లి: పోలీస్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌ను దృష్టిలో ఉంచుకుని జిల్లా యువతకు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ ఆధ్వర్యంలో 75 రోజుల ఉచిత డే స్కాలర్‌ శిక్షణ తరగతులు శుక్రవారం సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ హాజరై ఎస్పీతో కలిసి శిక్షణ తరగతులను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ... పోలీస్‌ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న జిల్లా యువతకు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ మాట్లాడుతూ... జిల్లా యువత పోలీస్‌ ఉద్యోగాలు సాధించేందుకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ఈ కోచింగ్‌ ప్రారంభించామన్నారు. పోలీస్‌ ఉద్యోగం ద్వారా సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ నరేష్‌కుమార్‌, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ నవీన్‌రెడ్డి, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement