న్యూస్‌రీల్
● నోటీసులు వచ్చినా..
ఆధారాలు సమర్పించని ఓటర్లు
● గడువు దాటుతున్నా నో రెస్పాన్స్
భూపాలపల్లి: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియ భూపాలపల్లి నియోజకవర్గంలో వేగవంతంగా సాగుతున్నప్పటికీ, నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదు. సమాచార లోపాలు, పేరులో తేడాలు, ఇతర సవరణల నిమిత్తం అధికారులు నోటీసులు జారీ చేయగా, ఆధారాలు సమర్పించే వారి సంఖ్య తక్కువగా ఉండటం అధికారులకు సవాల్‌గా మారింది.
గడువు సమీపిస్తున్నా జాప్యమే..
నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 32,636 ఎస్‌ఐఆర్ నోటీసులను సిస్టమ్ ద్వారా జనరేట్ చేశారు. అందులో సిబ్బంది 32,475 నోటీసులను నేరుగా ఓటర్లకు పంపిణీ చేశారు. ఇంకా 161 నోటీసులు పంపిణీ చేయాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారు అధికారులు ఇచ్చిన గడువు వారం రోజుల్లోపు విచారణకు హాజరు లేదా ఆధారాలు సమర్పించాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారిలో 12,310 మాత్రమే ఆధారాలను చూపించారు. మిగిలిన 20,165 మంది ఇంకా ఆధారాలను బీఎల్‌ఓలకు సమర్పించలేదు. దీంతో వీరిని రీ షెడ్యుల్ చేశారు. వీరంతా గడువులోగా సంబంధిత పత్రాలను అందించాల్సి ఉంది. అనామలిస్, నో మ్యాపింగ్ ఓటర్లకు సంబంధించిన క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు ఎన్నికల సంఘం తొలుత సెప్టెంబర్ 16వ తేదీ వరకు గడువు విధించినా అనంతరం అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించింది. దీంతో నోటీసులు అందుకున్న ఓటర్లు ఇంకా గడు వు ఉంది కదా అని వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.
అర్బన్‌లోనే అధికం..
కోల్‌బెల్ట్ పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లి పట్టణంలో ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వారు వేలాది మంది ఉన్నారు. దీంతో ఇక్కడ ‘సర్’ ప్రక్రియ ఆది నుంచి ఆలస్యంగానే సాగుతోంది. అర్బన్‌లో వివిధ కారణాలతో 11,222 మంది ఓటర్లకు అధికారులు నోటీసులు పంపిణీ చేయగా కేవలం 3,046 మంది మాత్రమే సకాలంలో విచారణకు హాజరై ఆధారాలను సమర్పించారు. జిల్లాలో 20,165 ఆధారాలు సమర్పించాల్సి ఉండగా, అందులో 8,176 మంది భూపాలపల్లి పట్టణానికి చెందిన వారే ఉన్నారు.
అనర్హత వేటు పడే
అవకాశం..
నోటీసులు అందుకున్న ఓటర్లు తగిన ఆధారాలతో హాజరై వివరాలు సరి చేసుకోకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓటు హక్కును కాపాడుకోవడానికి నోటీసులు వచ్చిన ప్రతీ ఒక్కరు వెంటనే స్పందించి తగిన ఆధారాలు సమర్పించాలని అధి కారులు సూచిస్తున్నారు.
మండలాల వారీగా వివరాలు...
మండలం నోటీసులు అందించినవి పెండింగ్ ఆధారాలు
సమర్పించినవి
భూపాలపల్లి అర్బన్ 11,256 11,222 34 3,046
భూపాలపల్లి రూరల్ 4,472 4,437 35 1,198
గణపురం 4,948 4,948 0 3,116
చిట్యాల 4,012 4,012 0 2,095
రేగొండ 3,840 3,840 0 872
శాయంపేట 1,850 1,762 88 1,050
మొగుళ్లపల్లి 1,123 1,119 4 270
టేకుమట్ల 756 756 0 508
కొత్తపల్లిగోరి 379 379 0 155


