కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారని, నిబంధనల ప్రకారం జరగడం లేదని ఇంజనీరు వర్గాలు కాంట్రాక్టర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. జూలై చివరి వారం నుంచి రూ.198కోట్ల వ్యయంతో కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణం చేపట్టారు. శుక్రవారం కాళేశ్వరం పనులపై ప్రత్యేకాధికారి, రిటైర్డ్ ఆర్‌అండ్‌బీ సీఈ కిషన్‌రావు, ఎస్‌ఈ రమేశ్‌బాబు, డీఈ దేవేందర్, ఈఓ మహేశ్ సంబంధిత కాంట్రాక్టర్ పనుల విషయంలో నెమ్మదిగా వ్యవహరిస్తుండడం, ఆశించిన స్థాయిలో క్షేత్రస్థాయిలో పనులు జరుగడం లేదని సమీక్ష ఏర్పాటు చేశారు. దేవాదాయశాఖ, ఆర్‌అండ్‌బీ ఇంజనీర్లు, క్షేత్ర కన్సల్టెన్సీ ఇంజనీర్లు సమీక్షలో పాల్గొన్నారని తెలిసింది. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను పరిశీలించారు. మొదట నైరుతి మూలన నిర్మిస్తున్న విజయ గణపతి ఆలయ పునాదిని చూశారు. అక్కడ స్టోన్‌తో నిర్మాణం చేపడుతుండడంతో మధ్యలో కాంక్రీటు లేదని, సిమెంట్‌తో బండకు బండ దూరంగా నింపుతుండడంతో నాణ్యత లోపిస్తుందని ఇంజనీర్లు గ్రహించినట్లు తెలిసింది. భవిష్యత్‌తో కుంగుబాటుకు గురవుతుందని చెప్పినట్లు సమాచారం. పునాదిపైన కృష్ణశిలతో ఆలయ నిర్మాణం తట్టుకునే విధంగా చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించినట్లు తెలిసింది. అక్కడి నుంచి ప్రాకారాల్లో నిర్మిస్తున్న పిల్లర్లకు స్టీల్ బయటకు కనిపిస్తున్నట్లు తెలిసింది. అక్కడి నుంచి ప్రధాన ఆలయం వద్ద శుక్రవారం పనులు ప్రారంభించారు. ఆ పనుల్లో దక్షిణం వైపున ఆలయం పునాది బండరాళ్లతో చేపట్టారు. నాలుగు ఫీట్ల మేర నిర్మాణం జరిగింది. పడమర వైపున పునాది మొదలు కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. రెండువైపులా నిర్మాణం చేపడితే జాయింట్ కలిపి పటిష్టంగా ఉంటుందని, భవిష్యత్‌లో లోపాలు వస్తాయని వారు పేర్కొన్నారని తెలిసింది. ప్రధాన ఆలయం నిర్మాణం జరుగుతుండంతో నాలుగు పిల్లర్ల విషయంలో ఆలయ అధికారులు, ఇంజనీర్లు ఆలోచన చేస్తున్నారని తెలిసింది. చుట్టూర పునాది పనులు జరిగిన తరువాత ద్విలింగాలపై క్షేత్ర కన్సల్టెన్సీ ఇంజనీర్లు ఇంటర్నల్‌గా డిజైన్స్ అందజేయలేదని తెలిసింది. ప్లంబింగ్, ఎలక్ట్రికల్, వాటర్ పైపు డిజైన్‌లు ఇవ్వకపోవడంతో నిర్మాణాలు పూర్తయితే మళ్లీ తొలగించడం జరుగుతుందని వెంటనే డిజైన్స్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. పునాది నిర్మాణాలపై కాంట్రాక్టర్ ఇంజనీర్ల మాట పెడచెవిన పెడుతూ.. వారిపై అజమాయిషీ చేస్తున్నట్లు సమాచారం.
కాంట్రాక్టర్ తీరుపై రిటైర్డ్ చీఫ్
ఇంజనీర్ ఆగ్రహం
పనులు స్లోగా జరుగుతుండడంపై
అసంతృప్తి


