వాతావరణ మార్పులు, వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, విరేచనాలు, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమల బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం వస్తే సొంత మందులు వాడకుండా వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వైద్యం పొందాలి
– డాక్టర్ పొనగంటి మనోజ్,
చిట్యాల సివిల్ ఆస్పత్రి
ఐదు రోజులుగా తీవ్రమైన ఎండలు కొడుతుండడంతో ఎండతాకిడికి గురై ఇబ్బంది పడ్డాను. దీంతో జ్వరం వచ్చింది. చిట్యాల సివిల్ ఆస్పత్రికి వచ్చి మూడు రోజులుగా చికిత్స పొందుతున్నాను. ప్రస్తుతం కొంచం పర్వాలేదు.
గోనెల రాజయ్య, నైన్‌పాక


