టేకుమట్ల: అత్యవసర సమయంలో బాధితులు 108కి కాల్ చేస్తే అంబులెన్స్ పైలట్, ఈఎంటీ వేగంగా స్పందించాలని 108 జిల్లా మేనేజర్ రాజునాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని 108 వాహనాన్ని తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని వైద్య పరికరాలు, మందులు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయంలో కీలకంగా వ్యవహరించి కాల్‌చేసిన వారికి 108లో సకాలంలో ప్రాథమిక చికిత్స అందిస్తూ సమీప ఆస్పత్రులకు చేర్చాలన్నారు. నిత్యం మందులు అందుబాటులో ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పైలట్ సత్యం, ఈఎంటీ బొమ్మ హరిప్రసాద్‌లకు సూచించారు.
కేటీపీపీ సీఈ
కార్యాలయం ముట్టడి
గణపురం: యాద్రాది పవర్ ప్లాంటు(వైటీపీఎస్) ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని కేటీపీపీ జేఏసీ నాయకులు శుక్రవారం కేటీపీపీ సీఈ కార్యాలయాన్ని ముట్టడించారు. టీజీపీఈ జేఏసీ పిలుపు మేరకు జేఏసీ నాయకులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర విద్యుత్ రంగ భద్రత, ఉద్యోగుల హక్కులను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
కాళేశ్వరం(కాటారం): గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ సూచించారు. శుక్రవారం మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో నిర్వాహకులు, ఆలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. వినా యక మండపాలు ఏర్పాటు చేసే ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారా అనుమతి పొందాలని పేర్కొన్నారు. వినాయక మండపాల వద్ద నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈ సమావేశంలో సీఐ నాగార్జునరావు, ఎస్సై శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకేంద్రంలో
కాంగ్రెస్ ధర్నా
భూపాలపల్లి రూరల్: కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద దళితుల శాంతియుత నిరసన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం కుల వివక్షకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ అన్నారు. బీఆర్‌ఎస్ నాయకుల అహంకారపూరిత, కుల వివక్షతను ప్రోత్సహించే చర్యలను నిరసిస్తూ శుక్రవారం జిల్లాకేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే, ఆ ప్రాంతాన్ని బీఆర్‌ఎస్ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అత్యంత అవమానకరమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణఅధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రాంనేని రవీందర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


