అమరుల సేవలు మరువలేనివి | - | Sakshi
Sakshi News home page

అమరుల సేవలు మరువలేనివి

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

కాళేశ్వరం జోన్‌

సీసీఎఫ్‌ ప్రభాకర్‌

భూపాలపల్లి: అటవీశాఖలో విధి నిర్వహణలో అమరులైన వారి సేవలు మరువలేనివని కాళేశ్వరం జోన్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌(సీసీఎఫ్‌) డాక్టర్‌ బి.ప్రభాకర్‌ అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అటవీ అధికారులు, సిబ్బంది తొలుత అటవీశాఖ కాంప్లెక్స్‌ ఆవరణలో అమరులను స్మరించుకొని మౌనం పాటించారు. అనంతరం గణేష్‌చౌక్‌ నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా మీదుగా కేటీకే 5వ ఇంక్లైన్‌ ఆర్చ్‌ వరకు బైక్‌ ర్యాలీ చేశారు. కాంప్లెక్స్‌కు చేరుకున్న తరువాత రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్‌, ఎఫ్‌డీఓలు సందీప్‌రెడ్డి, అప్పలకొండ, ఎఫ్‌ఆర్‌ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.

మట్టి వినాయక విగ్రహాల పంపిణీ..

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(టీజీపీసీబీ) ఆధ్వర్యంలో శుక్రవారం అటవీశాఖ జిల్లా కార్యాలయంలో 400 మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ శ్రీకాంత్‌, డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్‌, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement