ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

భూపాలపల్లి: వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఇబ్బందులు, లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పౌరసరఫరాలు, సహకార, మార్కెటింగ్‌, వ్యవసాయ, డీఆర్‌డీఏ, ఎస్‌డబ్ల్యూసీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలు, గోదాములు, రైస్‌మిల్లులు, రవాణా, గన్నీ బ్యాగుల లభ్యత తదితర అంశాలపై శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలను సమీక్షించారు. ధాన్యం సేకరణ ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, సమస్యలకు తావులేకుండా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కాటారం సబ్‌ కలెక్టర్‌ సౌరవ్‌ శర్మ, అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, పౌరసరఫరాల డీఎం రాములు, సహకార అధికారి వాల్యనాయక్‌, మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డి, డబ్ల్యూసీఆర్‌ఎం దీపిక, అదనపు డీఆర్‌డీఏ చౌహాన్‌, ఏఎంవీఐ సుందర్‌లాల్‌ పాల్గొన్నారు.

నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు

జిల్లాలో ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించనున్న వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం, గణపురం తదితర ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు, విధులపై వివిధ శాఖలకు బాధ్యతలు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

కలెక్టర్‌ రాహుల్‌శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement