ప్రకటనల హోరు.. పర్యవేక్షణ కరువు | - | Sakshi
Sakshi News home page

ప్రకటనల హోరు.. పర్యవేక్షణ కరువు

Sep 11 2026 9:46 AM | Updated on Sep 11 2026 9:46 AM

నిబంధనల ప్రకారమే..

జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన డిజిటల్‌ హోర్డింగ్‌, చినిగి వేలాడుతున్న ఫ్లెక్సీ (ఫైల్‌)

భూపాలపల్లి పట్టణంలో 80వేల వరకు జనాభా నివసిస్తున్నారు. జిల్లాకేంద్రంతో పాటు మంజూర్‌నగర్‌లో కలిసి సుమారు 15వరకు హోర్డింగ్‌లు ఉన్నాయి. ఏడు ఏజెన్సీలు హోర్డింగ్‌లు ఏర్పాటుచేస్తున్నాయి. ఇవే కాక అనుమతులు లేకుండా కూడా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు పదుల సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో ఇవి ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రమాదకర హోర్డింగ్‌లను తొలగించాలని గత నెలలో నిర్వహించిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. అయినా ఇప్పటి వరకు తొలగింపు ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో పట్టణ ప్రజలు ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో అనే భయపడుతున్నారు.

గతంలో పలువురికి గాయాలు..

ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై గల భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు కింద పడటంతో పలువురికి గాయాలయ్యాయి. పట్టణంలో ఇలాంటి ప్రమాదకర హోర్డింగ్‌లు చాలా ఉన్నాయి. జిల్లాకేంద్రం, మంజూర్‌నగర్‌లోనూ ఇలాంటివి ఉన్నాయి. పట్టణంలో ప్రమాదకర హోర్డింగ్‌లను తొలగించి ప్రమాదాల నివారణకు అధికారులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పర్యవేక్షణ లేక..

జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారి వెంట పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై పురపాలిక యంత్రాంగం పర్యవేక్షణ కరువైంది. ప్రచార ప్రకటనలతో పురపాలికకు రావాల్సిన రూ.లక్షల ఆదాయానికి గండిపడుతోంది. పురపాలిక మనుగడ సాగించాలంటే కేవలం నిధులపైనే ఆధారపడకుండా ఆదాయ మార్గాలను అన్వేషించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా ఆస్తి పన్ను, ఇళ్లద్వారా వచ్చే రాబడి మాత్రమే దిక్కవుతోంది. ఆదాయ మార్గాలెన్నో ఉన్నా పక్కా ప్రణాళిక లేకపోవడంతో వెనకడుగే పడుతోంది. ఇకనైనా అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం హోర్డింగ్‌ల ద్వారా 7 ఏజెన్సీల ద్వారా ఏటా కేవలం రూ.2.50లక్షల వరకు మాత్రమే ఆదాయం వస్తోంది.

సాధారణ ప్రజల నుంచి

ప్రముఖుల వరకు..

డిజిటల్‌ ఫ్లెక్సీలు వచ్చిన నాటి నుంచి సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు రద్దీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో ప్రకటనలు చేసుకుంటున్నారు. అవి ఒకరోజు కాకుండా వారాల తరబడి అలాగే ఉంచుతున్నారు. ఇలాంటి వారి వద్ద పన్ను వసూలు చేసే దిశగా పురపాలిక అధికారులు చొరవ తీసుకోవాలి. దీంతో కొంతమేర ఆదాయం సమకూరే అవకాశం ఉందని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ పాటించకుండా రోడ్ల పక్కన, కూడళ్లలో ఇనుముతో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తుండడంతో నిర్మాణాలు ఎప్పుడు పడిపోతాయోనన్న భయం పాదచారులు, వాహనదారులను వెంటాడుతోంది. ప్రధానంగా హోర్డింగ్‌ ఏర్పాటుపై నియంత్రణ, నిర్వహణలో పురపాలిక యంత్రాంగాలపై మితిమీరిన రాజకీయ జోక్యం, ప్రముఖ సంస్థల ఒత్తిళ్లు ఉన్నాయని వినికిడి. వీటిని తొలగిస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

పట్టణంలో ప్రమాదకరంగా హోర్డింగ్‌లు

చినిగి వేలాడుతున్న ఫ్లెక్సీలు మున్సిపల్‌ ఆదాయానికి గండి

జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ, హోర్డింగ్‌లు నిబంధనల ప్రకారమే ఉన్నాయి. ప్రమాదకరంగా మారిన హోర్డింగ్‌లను పరిశీలించి తొలగిస్తాం. హోర్డింగ్‌ల ద్వారా ఏడాదికి రూ.2.50లక్షల ఆదాయం వస్తుంది. మరింత ఆదాయం పెంచేందుకు కృషి చేస్తాం.

– చంద్రశేఖర్‌, టీపీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement