భూపాలపల్లి రూరల్: వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. గురువారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండపాల నిర్వాహకుల వివరాలను ప్రోఫార్మాలో నమోదు చేయించడంతో పాటు ప్రతీ మండపం వద్ద సైబర్ నేరాలపై అవగాహన పోస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇబ్బందులు కలగకుండా, భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జనానికి సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్ కుమార్, డీఆర్‌ఓ వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డివిజనల్ పంచాయతీ అధికారి మల్లికార్జున్‌రెడ్డి, ఇరిగేషన్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, ఎకై ్సజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ
జిల్లాలో వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ బీసీ మహిళలకు ఉపాధి కల్పించడానికి ఇంటింటా ఆటోమేటిక్ ఇందిరమ్మ కుట్టుమిషన్లు వంద శాతం సబ్సిడీతో అందించేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18 సంవవ్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగినవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
పీఏసీఎస్ విక్రయకేంద్రం ప్రారంభం
మహాముత్తారం: మండలకేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల విక్రయకేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువు, పురుగుల మందులను సరసమైన ధరలకు అందించడంతో పాటు పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, జిల్లా సహకార అధికారి వాల్యనాయక్, మహదేవపూర్ ఏడవే శ్రీపాల్, ఎంపీడీఓ నిశాంత్, మండల వ్యవసాయ అధికారి అనూష, పీఏసీఎస్ చైర్మన్ సోమ శాంతకుమార్, పీఏసీఎ సీఈఓ మార్క శ్రీధర్, పాలకవర్గ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


