అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి

Aug 20 2026 3:34 AM | Updated on Aug 20 2026 3:34 AM

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

భూపాలపల్లి: జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌ శర్మ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీసీ సమావేశంలో కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ రాహుల్‌ శర్మ పాల్గొని మాట్లాడారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 20,876 అనామలీస్‌, గత ప్రత్యేక ఓటరు సవరణతో అనుసంధానం లేని ఓటర్లు 11,739 మంది, యుఈఎఫ్‌లు 35,918 మంది మొత్తం 68,533 ఓటర్ల వివరాలు గుర్తించామన్నారు. నిబంధనల మేరకు పరిశీలించి, అవసరమైన చోట విచారణ నిర్వహించి పరిష్కరిస్తామన్నారు. ఏఈఆర్‌ఓలు, బూత్‌ సూపర్‌వైజర్లకు విచారణ ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ నిర్వహించి, తహసీల్దార్‌ స్థాయి నుంచి రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం సవరణ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. ఈ వీసీలో ఆర్డీఓ హరికృష్ణ్ణ, శిక్షణా డి ప్యూటీ కలెక్టర్‌ నవీన్‌రెడ్డి, భూపాలపల్లి, రేగొండ మండలాల తహసీల్దార్లు లక్ష్మీరాజయ్య, శ్వేత, పర్యవేక్షకులు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement