కనెక్షన్ల వివరాలు.. హెచ్‌పీ గ్యాస్‌ 49,302 భారత్‌ గ్యాస్‌ 39,905 ఇండేన్‌ గ్యాస్‌ 43,123 | - | Sakshi
Sakshi News home page

కనెక్షన్ల వివరాలు.. హెచ్‌పీ గ్యాస్‌ 49,302 భారత్‌ గ్యాస్‌ 39,905 ఇండేన్‌ గ్యాస్‌ 43,123

Aug 20 2026 3:34 AM | Updated on Aug 20 2026 3:34 AM

ఇబ్బందుల్లో గ్యాస్‌ వినియోగదారులు

జిల్లాలో 1,32,330 కనెక్షన్లు

కాళేశ్వరం: పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో గ్యాస్‌ సరఫరాలో ఏర్పడిన సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదు. వంట గ్యాస్‌ కోసం వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరు నెలలుగా కొత్త గ్యాస్‌ కనెక్షన్ల మంజూరు నిలిచిపోవడంతో కొత్తగా పైళ్లెన వారు, వేరు కాపురాలు పెట్టిన కుటుంబాలు, బదిలీలపై ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పక్కదారికి..

కొత్త కనెక్షన్‌ కోసం ఆయా గ్యాస్‌ ఏజెన్సీలను సంప్రదిస్తున్నప్పటికీ దరఖాస్తులు స్వీకరించేందుకు నిర్వాహకులు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు సిలిండర్లను సక్రమంగా సరఫరా చేయడానికే ప్రాధాన్యం ఇవ్వాలని చమురు కంపెనీల నుంచి ఆదేశాలు ఉన్నట్లు ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో కొత్త కనెక్షన్లతో పాటు ఇప్పటికే ఒక సిలిండర్‌ ఉన్న వినియోగదారులు డబుల్‌ సిలిండర్‌ కోసం కూడా ఎదురుచూస్తున్నారు. ఒక్క సిలిండర్‌కు బుకింగ్‌ సమయం 45 రోజులు ఉండడంతో రెండో సిలిండర్‌ తప్పనిసరైంది. రెండో సిలిండర్‌ కోసం మరోవైపు మార్కెట్‌లో గ్యాస్‌ కొరత లేదని చెబుతున్నప్పటికీ, సిలిండర్లు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు వినియోగదారులు సబ్సిడీ సిలిండర్లను అక్రమంగా రూ.2వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడుతుంది.

ఎప్పుడిస్తారో ?

కొత్త కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు సమ స్య ఎప్పుడు పరిష్కారమవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. యుద్ధం ముగిసినప్పటికీ మ రికొన్ని రోజులు వేచి చూడాలని అధికారులు చెబు తున్నారు. కనెక్షన్లు లేని వారు గ్యాస్‌ వాడకం తక్కువగా ఉన్నవారి వద్ద ఓటీపీ తీసుకొని ఎంతో కొంత ముట్టజెప్పి సిలిండర్లు తీసుకుంటున్నారు. మరికొంత మంది ఎలక్ట్రిక్‌ స్టవ్‌లు వాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement