భూపాలపల్లి అర్బన్: శాసీ్త్రయ పద్ధతిలో గని మూతవేత, పునర్వినియోగం చేసేలా చూడాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం ఢిల్లీ నుంచి భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శాసీ్త్రయ గని మూసివేత, గని పునర్వినియోగం, భూముల సుస్థిర వినియోగంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా దేశంలో 42 బొగ్గు గనులను శాసీ్త్రయ పద్ధతిలో మూసివేయడం అతిపెద్ద మైలురాయి అన్నారు. భవిష్యత్‌లో మొత్తం 105 బొగ్గు గనులను శాసీ్త్రయంగా మూసివేయడమే లక్ష్యమన్నారు. ఈ వీసీలో కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏరియా జీఎం రాజేశ్వరరెడ్డి, సింగరేణి అధికారులు తదితరులు పాల్గొన్నారు.


