● డీఎస్పీ సూర్యనారాయణ
కాళేశ్వరం: రోడ్డు భద్రత అందరి బాధ్యత అని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. గురువారం అరైవ్–అలైవ్‌లో భాగంగా మహదేవపూర్ మండలకేంద్రంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురికి జరిమాన విధించి, తొమ్మి ది వాహనాలను సీజ్ చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ కలిగి ఉండాలని, వాహనాలకు వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు సాంభమూర్తి, రమేశ్, ఏఎస్సై సుందరలాల్ ఉన్నారు.


