సమ్మె సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. సమగ్ర శిక్షను పూర్తిస్థాయిలో విద్యాశాఖలో విలీనం చేసి ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి వెంటనే ఉత్తర్వులు జారీచేయాలి. పేస్కేల్ అమలు కోసం మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం ప్రకటించాలి. సమ్మె కాలపు వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు జమ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలి.
– తౌటం నరేష్,
ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ రాష్ట్ర అధ్యక్షుడు


