రాజీమార్గంతోనే సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రాజీమార్గంతోనే సమస్యల పరిష్కారం

Aug 5 2026 1:41 AM | Updated on Aug 5 2026 1:41 AM

మల్హర్‌(కాటారం)/మహాముత్తారం: రాజీమార్గంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ పుప్పాల శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కాటారం సెంటర్‌, గ్రామ పంచాయతీ, ఇబ్రహీంపల్లి, చింతకానీ, గొర్లకుంట, మాదారం, మహాముత్తారం మండల కేంద్రంతోపాటు కొర్లకుంట, మాదారం గ్రామాల్లో అవగాహన సదస్సులు, మొబైల్‌ వ్యాన్‌లో విస్త్రత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయం పొందదగిన వారు, కోర్టు కేసుల్లో చిక్కి ఇబ్బందులు పడేవారు, న్యాయాన్ని పొందలేని నిస్సహాయులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కె.అక్షయ, ప్యానెల్‌ లాయర్‌ పారానంది సురేందర్‌, సూపరింటెండెంట్‌ రఘురామ్‌, కాటారం ఆర్డీఓ రవీందర్‌, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ జి.నవీన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌

పుప్పాల శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement