సండే సందడి | - | Sakshi
Sakshi News home page

సండే సందడి

Jul 27 2026 1:24 AM | Updated on Jul 27 2026 1:24 AM

వాజేడు: చాలా రోజుల తర్వాత బొగత జలపాతం వద్ద పర్యాటకు సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో సుమారుగా 2,500 మంది తరలివచ్చారు. బొగత జలపాతం అందాలను వీక్షించిన పర్యాటకులు సమీప కొలనులో కేరింతల కొడుతూ స్నానాలు చేశారు. చిలుకల పార్కులో పిల్లలతో కలిసి ఆనందంగా గడిపారు. కొందరు పర్యాటకులు చెట్ల కింద వంటలు చేసుకొని భోజనాలు చేశారు.

పర్యాటకుల రద్దీ

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం పర్యాటకుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్‌లు విజయ్‌కుమార్‌, వెంకటేశ్‌లు వివరించారు. అదేవిధంగా రామప్ప ఆలయాన్ని టూరిజం ఇన్‌ఫ్లుయెన్సర్లు సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వారి వెంట తహసీల్దార్‌ గిరిబాబు, ఈఓ భాస్కర్‌, ఆర్‌ఐ రమేశ్‌, సీసీ నాగరాజు పాల్గొన్నారు. అలాగే నెదర్లాండ్‌ దేశస్తుడు మనోలో ఆలయాన్ని సందర్శించి రామప్ప టెంపుల్‌ బ్యూటిఫుల్‌గా ఉందని కొనియాడారు.

హేమాచలుడికి

ప్రత్యేక పూజలు

మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని ఖమ్మం జిల్లా కోర్టు జడ్జి నాగరాజు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూనియర్‌ సివిల్‌ జడ్జి పూజిత వేర్వేరుగా ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు మర్యాద పూర్వకంగా వారికి స్వాగతం పలికారు. అర్చకులు పవన్‌కుమార్‌ ఆచార్యులు, రాజీవ్‌శర్మ జడ్జిల కుటుంబ సభ్యుల గోత్రనామాలతో స్వామివారికి పూజ లు నిర్వహించారు. ప్రత్యేక అర్చనలు జరిపించి వేద మంత్రోచ్ఛరణతో స్వామివారిని శేషవస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం ఇచ్చారు.

ప్రశాంతంగా ఉచిత కోచింగ్‌ అర్హత పరీక్ష

కేయూ క్యాంపస్‌: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా అభ్యర్థుల కోసం ఉచిత సివిల్‌ సర్వీసెస్‌లో శిక్షణ కోసం నిర్వహించిన ప్రవేశ అర్హత పరీక్ష ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ప్రశాంతంగా ముగిసింది. ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌. జ్యోతి, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి నిర్మల, హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌ జగన్‌మోహన్‌, ఆస్టడీ సర్కిల్‌ ప్రతినిధి కిరణ్‌ పర్యవేక్షించారు.

కేఎంసీ పూర్వవిద్యార్థుల యాప్‌ ఆవిష్కరణ

కాశిబుగ్గ: కాకతీయ వైద్య కళాశాల అలుమ్నీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఓకఇ అఠఝజీుఽజీ ఇౌుఽుఽ్ఛఛ్టి అధికారిక మొబెల్‌ యాప్‌ను హైదరాబాద్‌లోని ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిలో శనివారం రాత్రి ఆవిష్కరించారు. కేఎంసీ అలుమ్నీ అసోసియేషన్‌ అధ్యక్షుడు, కిమ్స్‌, సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కస్తూరి శ్రీధర్‌ తరుపున ఈ యాప్‌ను రూపొందించారు. క్యాన్సర్‌ హాస్పిటల్‌ మెడికల్‌ డైరెక్టర్‌, సర్జికల్‌ అంకాలజిస్టు సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు, రెమిడీ హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీవీఆర్‌ శ్రీధర్‌రావు, డాక్టర్‌ ఈశ్వర్‌ చంద్ర ఈ యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ యాప్‌ వారం రోజుల్లో గూగుల్‌ ప్లే స్టోర్‌, ఆపిల్‌ యాప్‌ స్టోర్‌లో అందుబాటులోని ఉంటుందని వారు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement