భూపాలపల్లి రూరల్: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల పోరాటంతోనే కేంద్రం దిగొచ్చిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ విజయానికి మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీలో డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌తో కలిసి ఎమ్మెల్యే సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో జరిగిన పోరాటంలో విద్యార్థులు, యు వతకు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అండగా నిలిచి కీలక పాత్ర పోషించారన్నారు. నీట్‌లో అక్రమాలపై నిరసన వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎమ్మెల్యే ఖండించారు. విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న అంశాల్లో జవాబుదారీతనం, పారదర్శకత ఉండేలా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ


