న్యూస్‌రీల్
ఒకే దరఖాస్తుతో బహుళ విద్యుత్ కనెక్షన్లు
ఆన్‌లైన్‌లో నమోదు
వినియోగదారులు టీజీఎన్పీడీసీఎల్ అధికారిక పోర్టల్ ద్వారా బల్క్/మల్టీపుల్ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈ విధానం ద్వారా విద్యుత్ కనెక్షన్ల మంజూరులో ఆలస్యం తగ్గి అపార్ట్‌మెంట్, గృహ నిర్మాణ, వాణిజ్య రంగాలకు మరింత వేగవంతమైన సేవలు అందుతాయి. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ ఇటీవల ప్రకటించారు. వివరాల కోసం 1912 లేదా 1800–425–0028 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు.
వినియోగదారులకు
వేగవంతమైన సేవలు
ఆన్‌లైన్ విధానంలో నమోదు ప్రక్రియ


