నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం

Jul 26 2026 2:08 AM | Updated on Jul 26 2026 2:08 AM

మల్హర్‌: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యమని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ రమేశ్‌ అన్నారు. శనివారం మండలంలోని పెద్దతూండ్ల సబ్‌స్టేషన్‌ నుంచి తాడిచర్ల పరిధిలో 5 కిలోమీటర్ల పొడవైన 33 కేవీ ఇంటర్‌ లింక్‌ లైన్‌ నిర్మాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 33కేవీ లైన్‌ ఏర్పాటుతో రైతులు, వినియోగదారులకు నిరంతర విద్యుత్‌ అందుతుందన్నారు. తాడిచర్ల, పెద్దతూండ్ల, ఏఎమ్మార్‌ సబ్‌ స్టేషన్ల పరిధిలో సాంకేతిక సమస్యలు ఎదురైనా, ఈ నూతన ఇంటర్‌ లింక్‌ లైన్‌ ద్వారా ప్రత్యామ్నాయంగా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించవచ్చన్నారు. అత్యవసర సమయాల్లో విద్యుత్‌ కోతలు, అంతరాయం లేకుండా నిరంతరం అందించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఈ నాగరాజు, సేఫ్టీ ఆఫీసర్‌ జగదీష్‌, కన్సట్రక్షన్‌ ఏడీ సందీప్‌, ఏఈ శ్రీనివాస్‌, లైన్‌మెన్‌ అశోక్‌, ఏఎల్‌ఎం రాజేందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ రమేశ్‌

తాడిచర్లకు 33కేవీ లైన్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement