మున్సిపల్ చైర్మన్ కొమురయ్యపై ఇప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్లు బహిరంగంగానే ఆరోపణలకు దిగారు. శనివారం కలెక్టర్ రాహుల్ శర్మ, డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్‌కు ఫిర్యాదు పత్రాలను అందించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో సమన్వయం లేకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని, కౌన్సిలర్ల అభిప్రాయాలు, సూచనలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని డీసీసీ అధ్యక్షుడికి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. తమను బూతులు తిడుతూ కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. మున్సిపాలిటీ పరిధిలో తాగునీరు, అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్‌శర్మను కాంగ్రెస్ కౌన్సిలర్లు కోరారు.


