కాళేశ్వరం వద్ద పెరిగిన గోదావరి | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం వద్ద పెరిగిన గోదావరి

Jul 25 2026 1:11 AM | Updated on Jul 25 2026 1:11 AM

కాళేశ్వరం: మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నది వరద కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసి ప్రవాహం పెరుగుతోంది. శుక్రవారం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 5.750 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాటును తాకుతూ నీటిమట్టం ప్రవహిస్తోంది. దిగువన మేడిగడ్డ బరాజ్‌కు వరద నీరు చేరడంతో అక్కడ 22,290 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద ప్రవాహం రావడంతో మొత్తం 85 గేట్లు ఎత్తడంతో దిగువకు అదే స్థాయిలో అవుట్‌ఫ్లో తరలిపోతున్నట్లు ఇంజనీర్లు పేర్కొంటున్నారు.

ఆరుతడి పంటలు

సాగుచేయాలి

రేగొండ: ఎల్‌నినో దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలను సాగుచేయాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ మదన్‌ మోహన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం రేగొండ, కొత్తపల్లిగోరి మండలాలలో సాగుచేస్తున్న పంటలను వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, భూపాలపల్లి టీఆర్‌వీకే వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పత్తిలో రసం పీల్చే పురుగుల బెడద నుంచి రక్షించుకోవడానికి జిగురు అట్టలను అమర్చాలని తెలిపారు. వరిలో ఆరుతడి పద్ధతిని పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్‌ పద్మజ, డాక్టర్‌ క్రాంతి, భూపాలపల్లి ఏడీఏ రమేశ్‌, మండల వ్యవసాయాధికారులు సారయ్య, వాసుదేవారెడ్డి, ఏఈఓలు ప్రశాంత్‌, భరత్‌, దివ్య, రైతులు పాల్గొన్నారు.

కార్యదర్శుల

జిల్లా ఫోరం ఎన్నిక

భూపాలపల్లి రూరల్‌: తెలంగాణ నాన్‌–గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ యూనియన్‌ (టీన్‌జీఓఎస్‌) ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని టీఎన్‌జీవోస్‌ భవన్‌లో శుక్రవారం జిల్లా పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు యూనియన్‌ ఎన్నికల అధికారి ఎ.దశరథ రామారావు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా అడగాని సాంబశివుడు, గౌరవ అధ్యక్షుడిగా లింగయ్య, జనరల్‌ సెక్రటరీగా అంబటి దేవేందర్‌, కోశాధికారిగా బొజ్జం వీరయ్య, ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు బూరుగు రవికుమార్‌, ములుగు జిల్లా అధ్యక్షుడు పోలు రాజు, వెంకటరమణ, కల్లెపు సదానందం, నూతన కార్యవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మొబైల్‌ డీటీఆర్‌ ట్రాలీ ప్రారంభం

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి సర్కిల్‌ పరిధిలో విద్యుత్‌ సరఫరాను మరింత మెరుగుపరచడంలో భాగంగా నూతనంగా మొబైల్‌ డీటీఆర్‌ (డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌) ట్రాలీని భూపాలపల్లి డివిజన్‌ కార్యాలయంలో శుక్రవారం ఆ శాఖ జిల్లా ఎస్‌ఈ రమేశ్‌ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు అకస్మాత్తుగా కాలిపోయినప్పుడు లేదా ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినప్పుడు, ప్రత్యామ్నాయ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుచేసే వరకు వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఈ మొబైల్‌ డీటీఆర్‌ ట్రాలీద్వారా తక్షణమే విద్యు త్‌ సరఫరాను పునరుద్ధరించవచ్చని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌ అంతరాయం సమయాన్ని గణనీయంగా తగ్గించి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈట్రాలీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డివిజన్‌ కార్యాలయం అధికారులు పాల్గొన్నారు.

ఈఈగా బాధ్యతల స్వీకరణ

కాళేశ్వరం: మహదేవపూర్‌ డివిజన్‌–1 ఇరిగేషన్‌శాఖ ఈఈగా అజ్మీరా సురేష్‌ శుక్రవారం మహదేవపూర్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన మేడిగడ్డ బరాజ్‌, లక్ష్మీపంపుహౌస్‌లతో పాటు మహదేవపూర్‌, పలిమెల మండలాల మైనర్‌ ఇరిగేషన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement