పలు ఘటనలు.. | - | Sakshi
Sakshi News home page

పలు ఘటనలు..

Jul 25 2026 1:11 AM | Updated on Jul 25 2026 1:11 AM

● కాళేశ్వరంలో రెండేళ్ల కిందట ఓ కిరాణం దుకాణంలో రూ.20వేల నగదు కౌంటర్‌ నుంచి దొంగిలించారు. సీసీ కెమెరాల్లో చిక్కినా ఇప్పటికీ నిందితులు దొరకలేదు.

● అదే ఏడాది ఓ సెల్‌ఫోన్‌ దుకాణంలో రెండుసార్లు చోరీ జరిగింది. సీసీ కెమెరాలకు చిక్కినా ఇప్పటికీ ఆచూకీ లేదు.

● గతేడాది రెండు ఎద్దుల జత పోయినా ఇప్పటికీ దొరకలేదు.

● ఇప్పలబోరులో ఆటోను ఎత్తుకెళ్లినా ఇప్పటి వరకు కనిపెట్టలేదు.

● నాలుగు నెలల కిందట ఎస్టీకాలనీ రోడ్డుపై ఉన్న ఆటోను ఎత్తుకెళ్లినా ఇంకా దర్యాప్తులోనే ఉంది.

● ఓ లాడ్జీలో ఏప్రిల్‌ నెలలో ఓ గుర్తు తెలియని ప్రేమజంటను తీసుకు వచ్చిన సమాచారం మేరకు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు రావడంతో వారు అక్కడి నుంచి గోడ దూకి పరారయ్యారు.

● మరో లాడ్జీలో మహారాష్ట్ర నుంచి వచ్చిన గుర్తు తెలియని జంట తమ తల్లిదండ్రులకు తెలియడంతో పారిపోయింది.

● నాలుగు రోజుల కిందట గోదావరిఖనికి చెందిన కానిస్టేబుల్‌పై బామ్మర్ది పోలీసులతో కలిసి సెల్‌ ట్రేసింగ్‌తో సెర్చ్‌ చేసి పట్టుకున్నాడు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement