సర్వే త్వరగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

సర్వే త్వరగా పూర్తి చేయాలి

Jul 25 2026 1:11 AM | Updated on Jul 25 2026 1:11 AM

భూపాలపల్లి: బల్క్‌ ల్యాండ్‌ సమస్యల పరిష్కారానికి చేపట్టిన సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో బల్క్‌ ల్యాండ్‌, రీ సర్వే, సర్‌ ప్రక్రియపై భూపాలపల్లి డివిజన్‌ రెవెన్యూ డివిజన్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న బల్క్‌ ల్యాండ్‌ సమస్యలను గ్రామాల వారిగా సర్వే నిర్వహించి నివేదికలు అందజేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో సాదాబైనామా కింద మొత్తం 39,300 దరఖాస్తులు అందగా, ప్రస్తుతం 26,698 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, డీఆర్‌ఓ వసంతకుమారి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ కుసుమకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్లు పాల్గొన్నారు.

యూనిఫామ్‌ అందించాలి..

ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి ఒక జత యూనిఫామ్‌ అందించాలని, ఆగస్టు 30 వరకు రెండు జతల యూనిఫామ్‌లు ఇవ్వాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం నుంచి ఎల్‌నినో నేపథ్యంలో పంటల పంటల వైవిధ్యీకరణ, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్‌ పంపిణీపై వివిధ శాఖల ప్రిన్సిపల్‌ కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ సంజయ్‌ జాజు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. కలెక్టర్లకు పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం కలెక్టర్‌ రాహుల్‌ శర్మ.. విద్యా, సంక్షేమ, డీఆర్‌డీఏ, వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement