● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
చిట్యాల: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. గురువారం చిట్యాల పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌లోని పలు రికా ర్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తుల పురోగతి, సీసీ కెమెరాల పని తీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో చక్కగా మాట్లాడి వారు ఇచ్చే ఫిర్యాదులను మర్యాదపూర్వకంగా స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన పోలీస్‌సేవలు అందించేందుకు ప్రతీఒక్కరు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీలో డీఎస్పీ సంపత్‌రావు, సీఐ మల్లేష్, ఎస్సై పోచంపల్లి సతీష్, సిబ్బంది ఉన్నారు.


