ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేయనున్న చెత్త డబ్బాలపై అవగాహన కల్పించింది. చెత్తవేసే విధానంపై ఐటీడీఏ కార్యాలయ అధికారులు గురువారం బోర్డు ఏర్పాటు చేశారు. ఏ రంగు డబ్బాలో ఏ చెత్త వేయాలని అందులో క్షుణ్ణంగా వివరించారు. ఈ మేరకు గ్రామ పంచాయతీల్లో ఇక నుంచి నాలుగు చెత్త డబ్బాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. జీపీ పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న వ్యర్థాలను వేర్వేరుగా చేసి చెత్తను డబ్బాల్లో వేయాలని క్లియర్‌గా పంచాయతీ అధికారులు, సిబ్బంది ప్రజలకు వివరించనున్నారు.


