కలెక్టరేట్‌ ఎదుట ధర్నా | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

Jul 24 2026 1:03 AM | Updated on Jul 24 2026 1:03 AM

భూపాలపల్లి అర్బన్‌: పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్‌ మాట్లాడుతూ.. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేసి విద్యార్థులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జొసఫ్‌, జిల్లా గర్ల్స కన్వీనర్‌ జడల రాజేశ్వరి, నాయకులు పోతుల పవన్‌, ఉల్లేరావు బన్నీ, రాజుల శివ పాల్గొన్నారు.

గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాకేంద్రంలో కిరాణం షాపుల్లో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నరేష్‌కుమార్‌ తెలిపారు. సీసీఎస్‌ పోలీసులు భూపాలపల్లి పట్టణంలో దాడులు నిర్వహించి రూ.1,96,430 విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. చాముండా జనరల్‌ స్టోర్స్‌, దుర్గా జనరల్‌ స్టోర్స్‌, పవన కృష్ణ కిరాణం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అంబర్‌, ఆర్‌ఆర్‌, అనార్‌, జేకే, మీరాజ్‌ తదితర నిషేధిత పొగాకు ఉత్పత్తులను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చాముండా జనరల్‌ స్టోర్‌ నిర్వాహకుడు ఛత్రారం సతీష్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఉన్నతాధికారుల

దృష్టికి తీసుకెళ్తా..

కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలో గతంలో పలు దుకాణాలకు టెండర్లు దక్కించుకున్న టెండర్‌దారుల సమస్యలను దేవాదాయశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చైర్మన్‌ అవధాని మోహన్‌శర్మ అన్నారు. ఇటీవల మంత్రి శ్రీధర్‌బాబును టెండర్‌దారులు కలిసి తమ సమస్యను వివరించిన విషయం తెలిసిందే. దీంతో గురువారం ఈఓ మహేష్‌తో దేవస్థానం కార్యాలయంలో టెండర్‌దారులతో కలిసి సమావేశం నిర్వహించారు. జూన్‌ 17నుంచి ఆలయం మూసివేయడంతో టెండర్‌దారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక నష్టాలను చైర్మన్‌, ఈఓలకు విన్నపించారు. టెండర్‌దారులు మాట్లాడుతూ, ఆలయం మూసివేయడంతో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇప్పటికే తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన బాలాలయం వద్ద సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టెండర్‌ మొత్తాన్ని తగ్గించాలని చైర్మన్‌ను కోరారు. టెండర్‌దారులు వివరించిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని ఆలయ చైర్మన్‌ హామీ ఇచ్చారు. సమావేశంలో ఆలయ కాళేశ్వరం సర్పంచ్‌ మోహన్‌రెడ్డి, ధర్మకర్తలు సత్యనారాయణ, సీతయ్య పాల్గొన్నారు.

మహదేవపూర్‌ డివిజన్‌–1 ఈఈగా సురేష్‌

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం ఇరిగేషన్‌ డివిజన్‌–1 ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ)గా అజ్మీరా సురేష్‌ నియమితులయ్యారు. ఇక్కడ ఈఈగా పనిచేస్తున్న తిరుపతిరావు ఇటీవల కరీంనగర్‌కు బదిలీ అయ్యారు. మళ్లీ ఆయనకు లింక్‌–1లోని మహదేవపూర్‌ డివిజన్‌–1కు బాధ్యతలు అప్పగించగా.. మేడిగడ్డ బరాజ్‌లో డీఈగా పనిచేస్తున్న సురేష్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈఎన్సీ అడ్మిన్‌ టి.శ్రీనివాస్‌ మూడు రోజుల కిందట ఉత్తర్వులు జారీచేశారు. శుక్రవారం మహదేవపూర్‌ కార్యాలయంలో సురేష్‌ ఈఈగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఆయనకు మేడిగడ్డ బరాజ్‌, లక్ష్మీపంపుహౌస్‌లతో పాటు మహదేవపూర్‌, పలిమెల మండలాల్లోని మైనర్‌ ఇరిగేషన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement