రేగొండ: నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు అన్నారు. శుక్రవారం కొత్తపల్లిగోరి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు


