మల్హర్: గుడుంబా తయారుచేసినా.. విక్రయించినా కఠిన చర్యలు తప్పవని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ హెచ్చరించారు. గురువారం అడ్వాలపల్లి గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. గ్రామంలో అధిక మొత్తంలో గుడుంబా తయారీదారులు ఉన్నారని.. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అప్పటికీ వారిలో మార్పు రానట్లయితే ప్రభుత్వ అందించే పథకాలు అన్ని రద్దవుతాయని చెప్పారు. ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని.. చిన్న పిల్లలకి వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 38 లీటర్ల గుడుంబాను, సుమారు 800 లీటర్ల బెల్లంపాకాన్ని ధ్వంసం చేసి ముగ్గురు వ్యక్తులపైన కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సీఐ నాగార్జునరావు. కొయ్యూరు ఎస్సై మహేందర్ కుమార్, కాటారం ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.


