ముందస్తు జాగ్రత్తలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ముందస్తు జాగ్రత్తలు పాటించాలి

Jul 9 2026 6:35 AM | Updated on Jul 9 2026 6:35 AM

పలిమెల: వర్షాకాలం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి చల్ల మధుసూదన్‌ వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. బుధవారం మహదేవపూర్‌, పలిమెల పరిధిలోని అంబట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర, పలిమెల, పంకెన గ్రామాల్లోని ఆయుష్మాన్‌ ఆరోగ్యకేంద్రాలను డీఎంహెచ్‌ఓ మధుసూదన్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య సిబ్బంది హాజరు వివరాలు, ఓపీ రిజిస్టర్‌, ల్యాబ్‌ నిర్వహించే పరీక్షల వి ధానం, ఫార్మసీ, లేబర్‌ రూమ్‌లను పరిశీలించారు. ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా మందుల స్టాక్‌ పెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు వైద్యసిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం మండలకేంద్రంలో నూతన నిర్మిస్తున్న పీహెచ్‌సీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్‌ కల్యాణి, డాక్టర్‌ జగదీశ్‌ ఖన్నా, డీపీఓ చిరంజీవి, డీడీఎం మధు, డాక్టర్‌ రఘురామ్‌, డాక్టర్‌ మల్లికార్జున్‌, డాక్టర్‌ విజయ్‌కుమార్‌, హెచ్‌ఓ సత్యనారాయణ, నర్సింగ్‌ ఆఫీసర్లు మరియా, స్వప్న, ఎల్‌టీ సుధాకర్‌, ఏఎన్‌ఎంలు, ఆశలు పాల్గొన్నారు.

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ చల్ల మధుసూదన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో ఓపీ రిజిస్టర్‌, ల్యాబ్‌, ఫార్మసీ, లేబర్‌ రూమ్‌, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మందుల నిల్వలు సమృద్ధిగా ఉంచాలని, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని వైద్య అధికారులకు సూచించారు.

డీఎంహెచ్‌ఓ మధుసూదన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement