రేగొండ: ఫాస్ట్ పుడ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన మండలకేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన జట్టి శ్రావణ్ (35)మండలకేంద్రంలోని వైన్స్ షాప్ ఎదురుగా ఫాస్ట్ పుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి షాపు మూసి ఇంటికి వెళ్తుండగా హత్యకు గురయ్యాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమా.. మరేదైనా కారణమా తెలియాల్సి ఉంది. యువకుడిని హత్యచేసిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిసింది. మృతుడికి భార్య మౌనిక, కూతురు, కుమారుడు ఉన్నారు.


