వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పలుచోట్ల ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
చర్య తీసుకోవాలి
కాటారం: నకిలీ భూ పత్రాలు సృష్టించి గిరిజన కుటుంబానికి చెందిన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న మండలకేంద్రానికి చెందిన బాలచందర్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీర పూల్‌సింగ్ నాయక్ తహసీల్దార్‌ను కోరారు. పూల్‌సింగ్ పలు సంఘాల నాయకులతో కలిసి సోమవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజుకు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంపై పూర్తి విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని తహసీల్దార్‌ను కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్ల ప్రభాకర్, జిల్లా నాయకుడు బొబ్బిలి రాజు, నాయక్‌పోడ్ సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లంకొండ పోశయ్య ఉన్నారు.
వనదేవతలను
దర్శించుకున్న ఈఓ
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను అదనపు కార్యనిర్వహణాధికారి మేకల వీరస్వామి సోమవారం దర్శించుకున్నారు. మేడారం ఈఓగా బాధ్యతలను స్వీకరించిన ఆయన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. మేడా రం వచ్చిన నూతన ఈఓ వీరస్వామిని సిబ్బంది మార్యాదపూర్వకంగా కలిశారు. పూజారులు దగ్గరుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈఓ వీరస్వామిని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు సన్మానించారు.
వాతావరణం


