అగ్నిమాపకశాఖ సూచనలు | - | Sakshi
Sakshi News home page

అగ్నిమాపకశాఖ సూచనలు

Apr 15 2025 1:16 AM | Updated on Apr 15 2025 1:16 AM

అగ్ని

అగ్నిమాపకశాఖ సూచనలు

● కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గి పుల్లలను ఆర్పివేసిన తర్వాత పారేయాలి. చెత్త, గడ్డి, ఎండిన చెట్లు, పూరిపాకల వద్ద వీటిని వేయరాదు.

● ఎక్కువ రోజులు ఇంట్లో లేని సమయంలో విద్యుత్‌ మెయిన్‌ ఆఫ్‌ చేయాలి.

● వంట గదిలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి.

● గృహాలకు గడ్డి వాములు 60 అడుగుల దూరంలో వేసుకోవాలి.

● పూరింట్లో నివసించే వారు వంట పూర్తయిన వెంటనే పొయ్యిలో నిప్పును ఆర్పేయాలి.

● వేసవిలో ఉదయం 8గంటల లోపు, సాయంత్రం 6గంటల తరువాత కట్టెల పొయ్యిలను ఉపయోగించాలి.

● గ్యాస్‌ సిలెండరుకు దగ్గరలో పెట్రోలు, డీజిల్‌, కిరోసిన్‌ వంటి మండే వస్తువులను ఉంచరాదు.

● వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్‌ ఆపివేయాలి.

● అపార్ట్‌మెంట్లు, కర్మాగారాల గోదాములు, గిడ్డంగులలో అగ్నిమాపక శాఖ సూచనలు విధిగా పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చు.

అగ్నిమాపకశాఖ సూచనలు1
1/1

అగ్నిమాపకశాఖ సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement