మల్హర్: రాజ్యాంగ రక్షణే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. మండలంలోని తాడిచర్లలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బడితెల రాజయ్య ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధన్’ సన్నాహక సమావేశంలో రాఘవరెడ్డి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతలను అవమానిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శీనుబాబు, పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండి, మాజీ ఎంపీపీ మల్హల్‌రావు, అయిత రాజిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి పాల్గొన్నారు.
రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్
జంగా రాఘవరెడ్డి


