ములుగు రూరల్: జిల్లాలోని సమ్మక్క–సారక్క గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని యూనివర్సిటీ వీసీ వై.ఎల్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన వర్సిటీలో ప్రస్తుతం రెండు కోర్సులు బీఏ ఎకానామిక్స్, బీఏ లిటరేచర్ ఉన్నాయని వచ్చే అకడమిక్ ఇయర్‌లో ఎంబీఏ, బయో టెక్నాలజీ, బీబీఏ కోర్సులు ప్రారంభించేలా కృషి చేస్తానన్నారు. విద్యార్థుల కోసం హాస్టల్ సౌకర్యం, క్లాస్ రూంల ఏర్పాటు, ములుగు ఏజెన్సీ ప్రాంతంలోని వర్సిటీకి నైపుణ్యం కలిగిన ప్రొఫెసర్‌ను తీసుకొస్తామన్నారు. త్వరలో ట్రైబల్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గిరిజన వర్సిటీ ప్రహరీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.25 కోట్లు కేటాయించిందని, గిరిజన వర్సిటీపై టోఫో గ్రాఫికల్ సర్వే నిర్వహిస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగిస్తామని చెప్పారు. విద్యార్థులను ఆకర్షించేందుకు అంతర్జాతీయ స్థాయిలో హాస్టల్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు, కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు త్వరలోనే బిల్డింగ్ నిర్మాణం కోసం ప్రత్యేక ప్రణాళికలను తయారు చేస్తామన్నారు.
గిరిజన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్
శ్రీనివాస్