కాటారం: మహాముత్తారం మండలంలో పట్టుబడిన జీరో మద్యం కేసులో మరో ముగ్గురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసినట్లు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ కిష్టయ్య తెలిపారు. ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం కనుకునూరు, సింగంపల్లి, నర్సింగాపూర్, మహాముత్తారం గ్రామాల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(జీరో మద్యం) విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఈ నెల 11న ఎకై ్సజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. కనుకునూర్‌లో బొచ్చు అనసూర్య ఇంట్లో తనిఖీలు చేపట్టగా కొంత మేర ఎన్‌డీపీఎల్, అక్రమ మద్యం లభించింది. సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా సింగంపల్లిలో శ్రీరామ్ ప్రేమ్‌కుమార్, నర్సింగాపూర్‌లో గాదె సారయ్య జీరో మద్యం సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రేమ్‌కుమార్ ఇంట్లో సోదాలు చేపట్టగా కొంత అక్రమ మద్యం లభించింది. అనంతరం విచారణలో ఇందులో సంబంధం ఉన్న నర్సింగాపూర్‌కు చెందిన సంది సుధాకర్, మారగోని బాపు పేర్లు తెలపడంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మహాముత్తారానికి చెందిన మహబూబ్ పాషా మధ్యప్రదేశ్ నుంచి ఎన్‌డీపీఎల్ మద్యం సరఫరా చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. మహబూబ్‌పాషా ప్రస్తుతం పరారీలో ఉన్నాడని గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ కిష్టయ్య తెలిపారు. ఈ దాడుల్లో 9.375 లీటర్ల ఎన్‌డీపీఎల్ మద్యం, 26.96 లీటర్ల అక్రమ మద్యం, 22.1 లీటర్ల బీర్లు స్వాధీనపర్చుకొని సీజ్‌చేసినట్లు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు.