భూపాలపల్లి రూరల్: రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన వారు నేటినుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వెనుకబడిన తరగతుల జిల్లా అధికారిణి శైలజ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని ప్రకటించిందన్నారు. ఇతర వివరాల కోసం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
హుండీ ఆదాయం
రూ.55,767
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని శ్రీ భక్తాంజనేయస్వామి దేవాలయ హుండీ ఆదాయం రూ.55,767 వచ్చినట్లు ఈఓ మహేష్ తెలిపారు. పరకాల డివిజన్ ఇన్‌స్పెక్టర్ కవిత ఆధ్వర్యంలో సోమవారం హుండీ లెక్కింపు చే పట్టినట్లు తెలిపారు. గతేడాది సెప్టెంబర్ నుంచి మార్చి వరకు హుండీకి వచ్చిన ఆదాయాన్ని లెక్కించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
రుసుం కోసం ట్రెంచ్
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ముక్తివనం పార్కు అభివృద్ధికి, సిబ్బంది జీతాల కోసం అటవీశాఖ ఆర్థిక వనరుల కోసం దృష్టి సారించింది. సోమవారం పలుగుల బైపాస్‌రోడ్డులోని హనుమాన్ దేవాలయం ఎదుట ఖాళీ స్థలంలో వాహనాలు నిలుపకుండా ట్రెంచ్(గోయి) తవ్వించారు. కాళేశ్వరం వచ్చే యాత్రికులు వంటలు చేసుకునేవారికి, ఇసుక లారీలకు, ఇతర వాహనాలకు కొంత రుసుం తీసుకొని ముక్తివనం పార్కు అభివృద్ధికి కేటాయించనున్నారు. రెండు రోజుల్లో రుసుం ప్రారంభం కానుందని అధికారుల ద్వారా తెలిసింది. మహా శివరాత్రి, ఏదైనా ఉత్సవాలు, పుష్కరాలు జరిగినప్పుడు ఆర్టీసీకి సంబంధించిన బస్టాండ్‌గా ఈ ప్రాంతాన్ని వినియోగించేవారు.
ట్రైబల్ యూనివర్సిటీని
సందర్శించి వీసీ
ములుగు: మండల పరిధిలోని జాకారంలో గల సమ్మక్క–సారక్క ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ తొలి వీసీగా బాధ్యతలు స్వీకరించిన వైఎల్.శ్రీనివాస్ సోమవారం వర్సిటీని సందర్శించారు. ఓఎస్డీ వంశీకృష్ణారెడ్డి, ప్రొఫెసర్లు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. యూనివర్సిటీలోని గ్రూపులు, ఎంత మంది విద్యార్థులు. యూనివర్సిటీలోని సౌకర్యాలు తదితర అంశాలపై ఆరా తీశారు.
నేటినుంచి దరఖాస్తుల స్వీకరణ