టేకుమట్ల: మండలంలోని రాఘవాపూర్ శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలంలోని సుబ్బక్కపల్లి, అంకుషాపూర్, ఆశిరెడ్డిపల్లి, పంగిడిపల్లి, పెద్దంపల్లి, గర్మిళ్లపల్లిలో శుక్రవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆశిరెడ్డిపల్లి, శ్రీవెంకటేశ్వరస్వామి, రాఘవాపూర్‌లో కొనసాగుతున్న శ్రీలక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. శ్రీలక్ష్మినరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో సీసీరోడ్డుతో పాటు గ్రామం నుంచి ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హా మీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సంగి రవి, మాజీ సర్పంచ్‌లు నందికొండ మహిపాల్‌రెడ్డి, చింతలపెల్లి స్వామిరావు, రామారావు, ఆలయ చైర్మన్ బండ రఘోత్తంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
నేటి నుంచి
ఒంటిపూట బడులు
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్ అన్ని పాఠశాలల్లోనూ ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమై కొనసాగనున్నాయి. ప్రతీ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలను నిర్వహిస్తారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో విద్యార్థులకు తప్పనిసరిగా తరగతులు అయిపోయాక మధ్యాహ్న భోజనం పెట్టాల్సి ఉంటుంది. ఈనెల 21 నుంచి టెన్త్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఉన్నందున.. పరీక్ష కేంద్రాలుగా ఉన్న హైస్కూళ్లను మధ్యాహ్నం ఒంటి గంటనుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలి. విద్యార్థులకు ముందే మధ్యాహ్న భోజనం అందించి తరువాత క్లాస్‌లు నిర్వహించాలని విద్యాశాఖాఽధికారులు తెలిపారు.
ఆస్పత్రులకు
పరికరాల పంపిణీ
ఏటూరునాగారం/వెంకటాపురం(కె) : స్వచ్ఛంద సంస్థ ద్వారా అందించిన పరికరాలను ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేశ్‌కుమార్ అన్నారు. రూ.27 లక్షల విలువ చేసే పరికరాలను వెంకటాపురం(కె), ఏటూరునాగారం ఆస్పత్రులకు సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడారు.