రేగొండ: మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి హనుమంత వాహనసేవలో స్వామి వారిని మాడవీధుల గుండా ఊరేగించారు. ఉదయం నిత్య విధి పూజలు, హోమం నిర్వహించారు. బలిహరణం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామి వారికి దీపోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆరగింపు, తీర్థప్రసాద వితరణ చేశారు.
జాతరలో పోలీస్ బందోబస్తు
ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ తరఫున భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. జాతరలో పోలీస్ బందోబస్తు గురించి పోలీస్ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. జాతరలో 10మంది ఎస్సైలు, 170 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాలు, జంక్షన్లు, గ్రామ పరిధిలో మొత్తం 18 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, ఆలయ ఈఓ మహేష్, చిట్యాల సీఐ మల్లేష్, ఎస్సైలు సందీప్‌కుమార్, షాఖాన్, అశోక్, ఆలయ కమిటీ సభ్యులు మల్లెబోయిన శ్రీధర్, ఆకుల రమేష్, మూల ఓంకార్, కనుకుంట్ల జోగేందర్, ఇల్లా కళావతి రవి, గ్రామ పెద్దలు కనుకుంట్ల దేవేందర్, ఆలయ సిబ్బంది రవిందర్, శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జాతరకు ప్రత్యేక బస్సులు
కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు, రేపు జరిగే జాతరకు పరకాల, భూపాలపల్లి డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తున్నట్లు భూపాలపల్లి డిపో మేనేజరు ఇందు తెలిపారు. కోటంచ జాతరకు వచ్చే భక్తుల రద్దీని బట్టి బస్సులు నడిపిస్తామని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
హోలీరోజున జాతర ప్రారంభం
కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం హోలీ పండుగ రోజున హోమ, బలిహరణములు మధ్యాహ్నం మహాపూర్ణాహుతి, సాయంత్రం బోనాలు తిరుగుటతో జాతర ప్రారంభమవుతుంది. సాయంత్రం పెద్ద రథోత్సవం, ఎడ్లబండ్లు, ప్రభబండ్లు, ఇతర వాహనాలు తిరుగు కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవ విగ్రహాల ప్రత్యేక అలంకరణ, ఊరేగింపు
నేటి నుంచి జాతర షురూ
జాతరకు ప్రత్యేక బస్సులు